నిజానిజాలు ఏవైనా సరే…. జాతీయ స్థాయిలో ఇప్పుడు పార్టీలు అనుకుంటున్నది ఏమిటంటే..? టీఆర్ఎస్, అన్నాడీఎంకే కావాలనే బీజేపీ స్ట్రాటజీకి అనుగుణంగా, అవిశ్వాసంపై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నాయి అని..! వైసీపీ, టీడీపీ బలంగా నమ్ముతున్నదీ అదే… బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అని చెబుతూ బీజేపీకి అనుగుణంగా వ్యవహరించడం ఏమిటీ అని మొన్న కేసీయార్‌తో జరిగిన భేటీలో మమత సూటిగా ప్రశ్నించిందనే వార్తలు కూడా వస్తున్నయ్… లోగుట్టు పెరుమాళ్లకెరుక..! జరుగుతున్న తంతు చూస్తే అది నిజమే అనిపించేలా మాత్రం కనిపిస్తున్నది… అయితే బీజేపీ ఈ మొత్తం యవ్వారంలో పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయిన మాట కూడా వాస్తవం… అవిశ్వాసానికి బీజేపీ భయపడుతున్నదీ అనే ప్రచారం దేశవ్యాప్తంగా పాకిపోయింది… నిజానికి బీజేపీకి ఉన్న మెజారిటీ కోణంలో చూస్తే, అవిశ్వాసంపై చర్చ జరిగినా, వోటింగు జరిగినా బీజేపికి వచ్చిన ప్రమాదమూ లేదు… నిజానికి వోటింగు జరిగితే, ఏ పార్టీ ఏమిటి..? ఎవరి వైపు అని బీజేపీకే క్లారిటీ వచ్చే ఉపయోగమూ ఉంది… అందుకే..?
మూడు రోజులుగా సభ గందరగోళం నడుమ వాయిదా పడుతూనే ఉంది… ఈ సమావేశాలకు సంబంధించి ఇక పాస్ చేయాల్సిన బిల్లులు లేవు, అర్జెంటుగా చేపట్టాల్సిన ఇష్యూస్ కూడా లేవు… అందుకని స్పీకర్ నిరవధిక వాయిదా వేయవచ్చుననే అభిప్రాయాలు వినిపించాయి… కానీ ఇప్పటికే బాగా డ్యామేజీ జరిగి పోయినందున వ్యూహం మార్చాలనే ఆలోచన మోడీ అండ్ షా మెదళ్లలో స్టార్ట్ అయినట్టు ఢిల్లీ సర్కిళ్లు చెబుతున్నాయి… అదేమిటీ అంటే..? దీన్నిలాగే వాయిదాలు వేస్తూ, తనే అవిశ్వాస తీర్మానానికి ప్రతిగా విశ్వాసతీర్మానం పెడితే ఎలా ఉంటుందని..!! ఇంట్రస్టింగు….
దీనివల్ల రెండు ప్రయోజనాలు… ఒకటి) ఈ అవిశ్వాసాలు, వోటింగును తను వెనక్కి పోవడం లేదు అనే మెసేజీని దేశప్రజానీకానికి ఇవ్వడం… రెండు) నిజంగానే పార్లమెంటులోని ఏ పార్టీ ఎవరి వైపు ఉన్నారో తేలిపోతుంది కాబట్టి, తదనుగుణంగా తన రాజకీయ వ్యూహాల్ని రాబోయే ఎన్నికలకు అనుగుణంగా రచించుకోవడం… బాగుంది… కానీ ఎప్పుడు..? వినిపించే సమాచారం మేరకు ఈ 23న గానీ లేకపోతే 26న గానీ విశ్వాస తీర్మానం పెట్టాలనేది ఆలోచనట..! ఇప్పుడు రచ్చ రచ్చ జరిగిపోయినందున, నిరవధిక వాయిదా వేస్తే నిజంగానే బీజేపీ భయపడి చర్చ జరగకుండా పారిపోయిందనే బదనాం తప్పదు… అది జరగకూడదూ అంటే విశ్వాస తీర్మానం పెట్టడం, చర్చ జరగడం, చంద్రబాబు సహా విపక్షంపై బీజేపీ పార్లమెంటులోనే ఎదురుదాడి చేయడం… అయితే దీనిపై మోడీ అండ్ షా ఇంకా నిర్ణయం తీసుకోలేదు… దీనివల్ల ఒరిగే లాభనష్టాలపై ఇంకా మథనంలో ఉన్నారట…! నిరవధిక వాయిదా వేయకపోవటానికి మరో కారణమూ ఉంది… తమ తమ అధికార గడువులు పూర్తయిపోయి, ఇంటికి వెళ్లిపోవల్సిన రాజ్యసభ సభ్యుల కోసం, ఈనెల 26న వీడ్కోలు కార్యక్రమం నిర్ణయించారు ఆల్రెడీ… అప్పటివరకూ సభ నడిపి, వాయిదాలు పడినా సరే, ఇలాగే కంటిన్యూ చేస్తూ… ఆ రోజు గానీ, మరుసటిరోజు గానీ విశ్వాసతీర్మానం పెడితే ఎలా ఉంటుందీ అనేది బీజేపీ తాజా ఆలోచనగా తెలుస్తున్నది…